కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా వీఎం బంజార్ పరిధిలో వ్యవసాయ విద్యుత్ మోటార్లు, కేబుల్ వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురుని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వీఎం బంజార చుట్టుపక్కల పొలాల్లో జరిగిన వరుస చోరీలపై ఐదు కేసులు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వీరి నుంచి 7 విద్యుత్ మోటార్లు, 200 మీటర్ల కేబుల్ వైర్లు, మోటార్ బైక్లతోపాటు మొత్తం రూ.2.8లక్షల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో నలుగురిని రిమాండ్కు తరలించారు. ప్రతిభ కనబరిచిన వీఎం బంజార్ ఎస్ఐ ఎస్.కె. షకీర్, సిబ్బందిని సత్తుపల్లి ఏసీపీ వసుంధర యాదవ్, రూరల్ సీఐ అభినందించారు.

