కలం, ఆదిలాబాద్ : గిరిజన పోరాట యోధుడు కుమురం భీమ్ కాంస్య విగ్రహావిష్కరణ (Kumuram Bheem Statue) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ కేస్లాపూర్ నాగోబా ఆలయ సర్మేడులు, ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను ఆహ్వానించారు. ఈ నెల 23న జరగనున్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేస్లాపూర్ సర్మేడులు మెస్రం వెంకట్రావు, మెస్రం దుర్గు, వాడగావ్ సర్మేడి మెస్రం చిన్ను, మెస్రం నాగనాథ్, సర్పంచ్ కోవా రాజేశ్వర్, ఇంద్రవెల్లి కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మెస్రం దేవరావు, మెస్రం శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

