పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం.. మునుగోడు ప్రజల ఆవేదన

కలం, మునుగోడు: మునుగోడు (Munugode) పట్టణంలోని కొన్నివార్డులలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను (Sanitation Crisis) తక్షణమే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. చెత్త సేకరణకు ట్రాక్టర్ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వార్డువాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డులో చెత్త సేకరణకు సరైన సౌకర్యాలు కల్పించకుండా, బయట చెత్త వేస్తే ఫొటోలు తీస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ముందుగా ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, అనంతరం నిబంధనలను అమలు చేయాలని సూచిస్తున్నారు.

అలాగే వార్డులో మురికి కాలువల సమస్య, వీధుల్లో పందుల సంచారం, దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెత్త సేకరణకు ట్రాక్టర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, మురికి కాలువలను శుభ్రం చేయాలని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన పాలకవర్గం, అధికారులు వార్డులో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మునుగోడు మండల కేంద్రంలోని వార్డులలో నెలకొన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>