అమృత పూజారికి ప్రపంచ రెజ్లింగ్‌లో రజతం

కలం, స్పోర్ట్స్: అమెరికాలో జరుగుతున్న అండర్‌-23 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ అమృత పూజారి (Amruta Pujari) రజత పతకం సాధించింది. మహిళల 72 కిలోల విభాగం ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన ఇరినా జాబ్లోట్స్కా చేతిలో 0-6తో ఓడిపోయింది. దీంతో స్వర్ణ పతకం చేజారినా.. అమృత రజతంతో మెరిసింది. ఈ ఫలితంతో భారత్‌ ఖాతాలో మొత్తం మూడు పతకాలు చేరాయి. అంతకుముందు అమృత అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో చైనాకు చెందిన వెంజిన్‌ క్యూను పిన్‌ఫాల్‌ ద్వారా ఓడించింది.

వరుస విజయాలతో టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. మహిళల 59 కిలోల విభాగంలో కోమల్‌ కాంస్య పతకం సాధించింది. కాంస్యం కోసం జరిగిన పోటీలో కజకిస్థాన్‌ రెజ్లర్‌ విక్టోరియా ఖుసైనోవాపై 7-2తో విజయం సాధించింది. మరోవైపు, గ్రీకో-రోమన్‌ 55 కిలోల విభాగంలో విశ్వజిత్‌ మోరే ఇప్పటికే రజత పతకం గెలిచాడు. దీంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ పతకాల సంఖ్య మూడుకు చేరింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>