గ్రామాల్లో వెంటనే ఆ పనులు స్టార్ట్!: కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, ఆదిలాబాద్ : విబి జి రామ్ జి పథకం కింద గ్రామాల్లో పశువుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు నీటి తొట్టెల నిర్మాణం, గ్రామాల్లోని వాటర్ ప్లాంట్ల వద్ద కమ్యూనిటీ ఇంకుడు గుంతల ఏర్పాటు కోసం అవసరమైన పనులను క్షేత్రస్థాయిలో గుర్తించి, అంచనాలు సిద్ధం చేసి నిర్మాణాలు తక్షణమే చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajarshi Shah) శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు గ్రామాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, ఎక్కడెక్కడ ఈ పనులు అవసరమో గుర్తించాలని సూచించారు.

వెటర్నరీ శాఖ అందించిన జాబితాలోని గ్రామాలకే పరిమితం కాకుండా, ఆయా మండలాల పరిధిలో పశువుల నీటి తొట్టెలు అవసరమైన ఇతర గ్రామాలను కూడా గుర్తించి, సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు తాగునీటి సదుపాయం కల్పించేందుకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి, నీటి తొట్టెల నిర్మాణానికి తగిన స్థలాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. గుర్తించిన ప్రతి పనికి అవసరమైన అంచనాలను రూపొందించి, నిబంధనల ప్రకారం పరిపాలనా అనుమతులు పొందిన అనంతరం నిర్మాణ పనులు చేపట్టాలని తెలిపారు. ఈ పనుల అమలులో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. గ్రామాల్లోని వాటర్ ప్లాంట్ల వద్ద నీటి వృథాను నివారించడంతో పాటు, నీటి సంరక్షణకు దోహదపడేలా కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణానికి అనువైన ప్రదేశాలను గుర్తించాలని కలెక్టర్ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>