కలం, సినిమా: ఇవాళ నటి కీర్తి సురేశ్ బర్త్ డే (Keerthy Suresh). మహానటి, దసరా లాంటి సినిమాలతో టాలీవుడ్పై తనదైన ముద్ర వేశారు. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు కథా బలమున్న పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం కీర్తి వరుస సినిమాలు చేస్తూ బిజిబీజీగా ఉన్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా పలు సినిమాల నుంచి వరస అప్డేట్స్ సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 12 విడుదల మూవీ నుంచి అదిరిపొయే లుక్ రిలీజ్ అయ్యింది.
కీర్తి సురేశ్(Keerthy Suresh)కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘జనవరి 12 విడుదల’ చిత్ర బృందం ప్రత్యేక పోస్ట్ను షేర్ చేసింది. ఈ సంక్రాంతికి ‘లతా రెడ్డి’గా సరికొత్త పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు కీర్తి సిద్ధమవుతున్నారు. ట్రాక్టర్ నడుపుతూ, తలకు వైట్ టవాల్ ధరించి గ్రామీణ యువతి పాత్రలో ఇట్టే ఒదిగిపోయారు. ప్రస్తుత ఆమె లుక్స్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. వెంకటేశ్, నందమూరి కల్యాణ్, అనిల్ రావిపూడి భాగమైన ఈ చిత్రం 2027 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
Also Read : ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Follow Us On: X(Twitter)

