సీఎం విజ‌య్‌కి అనిరుధ్ పెళ్లి ఇన్విటేష‌న్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ (Anirudh), స‌న్ గ్రూప్ అధినేత క‌ళానిధి మార‌న్ కుమార్తె కావ్యా మార‌న్ (Kavya Maran) రానున్న నవంబర్​లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికల పంపిణీ చకచకా జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్​కు ఇన్విటేషన్లు చేరాయి. కళానిధి మారన్, అనిరుధ్ తదితరులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, తమిళనాడు సీఎం విజయ్​ (CM Vijay)ని కలిసి వివాహ రిసెప్షన్ ఆహ్వాన పత్రికలను అందజేసిన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఈ సమావేశాలకు సంబంధించిన చిత్రాలను సన్ న్యూస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.

కావ్యా మారన్, అనిరుధ్ రవిచందర్‌ల వివాహ రిసెప్షన్ ఆహ్వాన పత్రికను ప్రధాని నరేంద్ర మోదీకి, అలాగే తమిళనాడు సీఎం విజయ్‌కు సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ స్వయంగా అందజేసినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రత్యేక భేటీల్లో కావ్య తల్లిదండ్రులు కావేరీ మారన్, అలాగే అనిరుధ్ తల్లిదండ్రులు లక్ష్మి, రవిచందర్‌లతో పాటు అనిరుధ్ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే, ప్రధాని మోదీని కలిసిన ఫొటోల్లో మాత్రం అనిరుధ్ కనిపించలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>