ఇంటర్నెట్ పొందడం ప్రాథమిక హక్కు: సుప్రీం కోర్టు

కలం, వెబ్ డెస్క్: ఇంటర్నెట్ పొందడం ప్రతి వ్యక్తి ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. వయస్సు ఆధారంగా నెట్ సౌకర్యం కల్పించాలనే వాదనే అర్థరహితమని స్పష్టం చేసింది. 18 ఏళ్ల లోపు వారికి నెట్ నిషేధించాలంటూ దాఖలైన ఒక పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇంటర్నెట్ ద్వారా పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల అంశాన్ని మర్చిపోవద్దని.. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాలు అమలు చేయడంతో పాటు ఆయా సోషల్ మీడియా ప్లాట్​ ఫారాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ నోటీసులు జారీ చేసింది. పిల్లల భద్రత, స్వేచ్ఛ అనే అంశాలు ఒకదానికొకటి అడ్డంకి కావొద్దన్నారు. వారి హక్కులను సంరక్షిస్తూనే.. కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేసింది.

అలా చేస్తే మరిన్ని సమస్యలు..

పిల్లలను వయస్సు ఆధారంగా ఇంటర్నెట్ వినియోగించకుండా నియంత్రించడం కొత్త సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని సుప్రీం కోర్టు (Supreme Court) అభిప్రాయపడింది. ప్రభుత్వం నియంత్రణ లేని, అత్యంత ప్రమాదకరమైన వెబ్ సైట్ల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో తమకు ఎలాంటి వేధింపులు ఎదురైనా స్వేచ్ఛగా తల్లిదండ్రులకు చెప్పే వాతావరణం ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే, 18 ఏళ్ల లోపు వారికి ఇంటర్నెట్ వినియోగించుకోకుండా కొత్త విధానం తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందుకు సంబంధించిన మరో పిటిషన్ సుప్రీం కోర్టులో ఉండగానే.. ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Also Read : క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి నేనున్నానంటూ కేటీఆర్ భరోసా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>