మధిర కోర్టులో నూతన రికార్డు రూమ్ ప్రారంభం!

కలం, మధిర: ఖమ్మం జిల్లా ​మధిర కోర్టు (Madhira Court) ఆవరణలో నూతనంగా నిర్మించిన రికార్డు రూమ్‌ (New Record Room) ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద, ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు విచ్చేశారు. మధిర కోర్టు ప్రాంగణానికి చేరుకున్న న్యాయమూర్తులకు కోర్టు అధికారులు, బార్ అసోసియేషన్ సభ్యులు, అడ్వకేట్లు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. ​

అనంతరం హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద మధిర కోర్టు నూతన రికార్డు రూమ్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కోర్టు రికార్డుల భద్రత, నిర్వహణ మరింత మెరుగుపడేందుకు ఈ నూతన గది ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు, అడ్వకేట్లు, కోర్టు సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>