హైదరాబాద్ ఇండిగో విమానంలో బాంబు కలకలం!

కలం, వెబ్ డెస్క్​ : అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ (Indigo Bomb Threat) ఒక విద్యార్థిని చేసిన ప్రచారం తీవ్ర కలకలం రేపింది. ఈ బెదిరింపు సమాచారంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే అధికారులు త్వరితగతిన స్పందించి ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు దింపారు. అనంతరం విమానాన్ని ప్రత్యేకంగా కేటాయించిన ఐసోలేషన్ బేకు తరలించారు. అక్కడే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల తర్వాత బాంబు బెదిరింపు కేవలం అవాస్తవమని తేలడంతో ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>