ఖమ్మంలో బుల్లెట్ బైకర్లకు పోలీసుల హెచ్చరిక

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు పోలీసులు(Khammam Traffic Police) శుక్రవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. నగరంలోని లకారం జంక్షన్ వద్ద ట్రాఫిక్ సీఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు రవి, రాముతో పాటు సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు అమర్చిన ఐదు బుల్లెట్ మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అలాగే, నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 25 వాహనాలను గుర్తించి జరిమానాలు విధించారు. వాహనాలు నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడే వారిపై కూడా ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రతి వాహనానికి ముందు, వెనుక స్పష్టంగా కనిపించేలా నంబర్ ప్లేట్లు ఉండాలని, నిబంధనలు పాటించకపోతే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం నిర్వహించే తనిఖీలకు వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>