యాదగిరిగుట్టలో బీజేవైఎంకు కొత్త అధ్యక్షుడు

కలం, యాదగిరిగుట్ట: భారతీయ జనతా పార్టీ నాయకత్వం నిర్ణయం మేరకు యాదగిరిగుట్ట పట్టణ భారతీయ జనతా యువ మోర్చా (BJYM) అధ్యక్షుడిగా (New Town President) కాలూరి విజయ్ నియమితులయ్యారు. ఈ నియామకంపై బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ హర్షం వ్యక్తం చేశారు. యువతను పార్టీ వైపు ఆకర్షించి, సంస్థాగతంగా బీజేవైఎంను బలోపేతం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నూతన అధ్యక్షుడికి సూచించారు. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా క్రమశిక్షణతో పనిచేయాలని ఆకాంక్షించారు. కాలూరి విజయ్ నాయకత్వంలో యాదగిరిగుట్టలో యువ మోర్చా మరింత క్రియాశీలకంగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>