కలం, నిర్మల్ : దుర్గామాత కృపాకటాక్షాలు నిర్మల్ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) కోరారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాంరావు బాగ్, బంగల్పేట్, బోయివాడ కాల్వగడ్డ కాలనీల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నవరాత్రి ఉత్సవాలు భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయని అన్నారు. ఆయా కాలనీలకు చేరుకున్న ఎమ్మెల్యేకు (Maheshwar Reddy) మండపాల నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయనను శాలువాలతో సత్కరించారు.

