నితీష్ బ్యాటింగ్‌లో మరింత మెరుగవ్వాలి: మాజీ కోచ్

కలం, స్పోర్ట్స్​ : ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ప్రస్తుతం తన పూర్తి సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడటం లేదని భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ (Sridhar) వ్యాఖ్యానించారు. బ్యాటింగ్‌లో అతడు ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వరుస గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా నితీష్‌ను జట్టు యాజమాన్యం తీర్చిదిద్దుతోంది. అయితే, వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో నితీష్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఇప్పటివరకు నితీష్ మూడు ఫార్మాట్లలో కలిసి 27 మ్యాచ్‌లు ఆడారు. అందులో 658 పరుగులు చేయడంతో పాటు 21 వికెట్లు పడగొట్టారు.

ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. ప్రపంచకప్ సమయానికి నితీష్ (Nitish Kumar Reddy) తన ఆట తీరును మెరుగుపరుచుకుంటాడని లేదా హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌నెస్‌తో జట్టులోకి తిరిగొస్తాడని శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక వెస్టిండీస్ సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. అక్కడ ఐదు టి20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. న్యూజిలాండ్ టూర్ లో హార్దిక్ లోటు కనిపిస్తుందని మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా అభిప్రాయపడ్డారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా నితీష్‌కు ఉందన్న ఆయన, ఒత్తిడి సమయాల్లో ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడమే ప్రధాన సవాలని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>