కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ ప్రాంతంలోని వృద్ధాశ్రమంలో దసరా పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ అధ్యక్షురాలు డాక్టర్ జయశ్రీ వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. పండుగ వేళ వృద్ధాశ్రమానికి వెళ్లి అవ్వాతాతలతో ఆప్యాయంగా మాట్లాడి, వారికి చీరలు అందజేశారు. కుటుంబాలకు దూరంగా ఉంటున్న వృద్ధులతో పండుగ ఆనందాన్ని పంచుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని డాక్టర్ జయశ్రీ పేర్కొన్నారు. వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం ఆనందంగా ఉందన్నారు. పండుగ అంటే కొత్త బట్టలు ధరించడమే కాకుండా, ఆప్యాయతను పంచుకోవడం, ఆత్మీయతను అందించడమని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ సంతోష్, రవి, నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

