పంట వాయిదా వేయండి.. రైతులకు సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి

కలం, వెబ్ డెస్క్: సూపర్ ఎల్ నినో దృష్ట్యా తెలంగాణపై తీవ్ర కరువు ప్రభావం పడటంతో రాష్ట్ర రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక విజ్ఞప్తి చేశారు. తీవ్ర నీటి కరువు ఉండటంతో రైతులు తమ పంటను వాయిదా వేసుకోవాలని కోరారు. ఈ మేరకు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటుందని అన్నారు. ఇప్పటివరకు చేతికి అందినపంటను నష్టపోవద్దని కొనుగోలు చేస్తూనే ఉన్నామని తెలిపారు. పంట సాగు చేసేందుకు నీళ్లు ఇస్తే..  ప్రజలు నీళ్లు తాగడానికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని అన్నారు. పంట వేయని రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Also Read : కోవిడ్​ లాంటి సంక్షోభం.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>