వైస్ కెప్టెన్సీ కేవలం పేరు మాత్రమే కాదు : షఫాలీ వర్మ

కలం, స్పోర్ట్స్ : భారత టీ20 వైస్ కెప్టెన్సీ పదవి కేవలం ఒక పేరు మాత్రమే కాదని, అదొక సవాలుతో కూడిన పెద్ద బాధ్యత అని షఫాలీ వర్మ (Shafali Verma) అన్నారు. వైస్ కెప్టెన్‌గా ఉండటం సులువు కాదని, ప్రతీ ప్లేయర్‌ను మానసికంగా సిద్ధం చేస్తూ కెప్టెన్‌కు తోడ్పడటంలో ఎంతో శ్రమ ఉందనే కోణంలో ఆమె వ్యాఖ్యానించారు. గతంలో అండర్-19 జట్టుకు నాయకత్వం వహించిన అనుభవంతో ఈ బాధ్యతను సమర్థవంతంగా మోస్తానని తెలిపారు. స్మృతి మంధాన సారథ్యంలో జింబాబ్వే సిరీస్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రిపరేషన్స్ ప్రారంభమవుతున్న వేళ ఆమె మీడియాతో మాట్లాడారు.

మహిళా క్రికెట్ ప్రగతికి మాజీ కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్ అందించిన సేవలను షఫాలీ (Shafali Verma) కొనియాడారు. రాబోయే మ్యాచ్‌లలో భయం లేని, సమయస్ఫూర్తితో కూడిన క్రికెట్ ఆడటమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు నెట్ ప్రాక్టీస్‌లో క్లిష్టమైన పరిస్థితులను అనుకరిస్తూ కష్టపడుతున్నట్లు వివరించారు. 2025లో జట్టుకు దూరమైన సమయంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ, ఫిట్‌నెస్, స్థిరత్వంపై చేసిన కఠిన శ్రమే తనను మళ్లీ ఫామ్‌లోకి తెచ్చిందని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>