కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివి: సాయిని మల్లేశం

కలం, కరీంనగర్: భారతదేశ మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను బీజేపీ మైనారిటీ మోర్చా మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని పార్లమెంట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం (Saini Mallesham) ముఖ్య అతిథిగా విచ్చేసి, అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సాయిని మల్లేశం, మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ ముజీబ్ లు మాట్లాడుతూ.. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదని, కోట్ల మంది యువతకు రోల్ మోడల్, నిరుపమాన దేశభక్తుడని కొనియాడారు. దేశ ప్రగతికి యువత శక్తి ఎంతో కీలకమని నమ్మిన కలాం, విద్యార్థుల్లో ఉన్నతమైన ఆలోచనలు నింపడానికి తన జీవితాంతం కృషి చేశారని గుర్తుచేశారు.

ఆయన చూపిన బాటలో నడుస్తూ, దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం దేశానికి అందించిన సేవలు,దేశ రక్షణ కోసం అబ్దుల్ కలాం చేసిన కృషి మరువ లేనివన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, సమీయుల్లా అహ్మద్, సైద్, ఫయాజ్, అబూ బకర్, అమెర్, రౌఫ్, తదితరులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>