నాణ్యతలో రాజీ పడొద్దు.. అధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) ఆసుపత్రిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, రోడ్లు, భవనాల నిర్మాణాలు, మరమ్మతులు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajarshi Shah) స్పష్టం చేశారు. గురువారం రిమ్స్ ఆసుపత్రితో కొనసాగుతున్న అభివృద్ధి పనులను, కొత్తబ్లాక్ నిర్మాణాలను, మరమ్మత్తు పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌తో కలిసి తనిఖీ చేశారు.

అనంతరం రిమ్స్ (Adilabad RIMS) డైరెక్టర్ చాంబర్‌లో అధికారులతో సమీక్షించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. టెండర్లలో బిడ్లు తక్కువకు వేసినప్పటికీ పనుల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని తేల్చిచెప్పారు. ఎంబీఎస్ గైడ్‌లైన్స్ ప్రకారం కన్సల్టెంట్ ఇంజనీర్లు పర్యవేక్షించి, నిర్దేశిత 13-14 శాతం ప్రాఫిట్ మినహాయించి నాణ్యమైన పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు.

ఒకవేళ ఎక్కడైనా లోపాలు లేదా గ్యాప్స్ ఉంటే, వాటిని వెంటనే గుర్తించి మరింత పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను అప్రమత్తం చేశారు. కొత్తబ్లాక్, ఆసుపత్రి పరిసరాల్లో పారిశుద్ధ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అటెండెండ్లు, రోగుల సౌకర్యార్థం వాషింగ్ ఏరియాలు, డస్ట్ బిన్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పారు.

డస్ట్ బిన్లు, వాషింగ్ బేసిన్లు సక్రమంగా వాడకపోతే లేదా పరిశుభ్రత లోపిస్తే సంబంధిత ఏజెన్సీలకు, సెక్యూరిటీ గార్డులకు తక్షణమే జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన బుక్స్ ప్రింట్ అయ్యాయని, త్వరలో క్షేత్రస్థాయిలో జరిమానాల అమలు ప్రారంభమవుతుందని తెలిపారు. ఎసీఎల్‌బి, నావిగేషన్, ఇతర అధికారుల బృందాలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలిస్తూనే ఉంటాయని, లోపాలుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

కొత్తబ్లాక్ ప్రాంతంలో ఇప్పటికే ఎంఎన్‌ఐసీయూ సేవలు ప్రారంభించామని, ఈ బ్లాక్‌కు సంబంధించి శానిటేషన్ అన్ని రకాలుగా మెరుగ్గా ఉండాలని సూచించారు. త్వరలోనే దీనిపై మరోసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి తదుపరి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని, పనుల్లో నాణ్యతను పరిశీలించేందుకు అధికారులు నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలు చేయాన్నారు.

Also Read : గడ్డం పెంచుకుంటే ప్రజల్లో విశ్వాసం రాదు.. కేటీఆర్​ కు వీరేశం కౌంటర్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>