రైతు బీమా జాప్యం.. రేవంత్‌ రెడ్డికి హరీశ్ రావు సవాల్

కలం, మెదక్ బ్యూరో: సంక్షేమ పథకాలు అమలుపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికే కరెంట్ సరఫరా, రైతుల సమస్యలపై ఆయన ప్రశ్నించారు. గురువారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో రైతు బీమా లబ్ధి అందని బాధిత రైతు కుటుంబాలతో హరీశ్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రైతు బీమా అందించకపోతే బాధిత కుటుంబాలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని, సచివాలయాన్ని ముట్టడిస్తామని  హెచ్చరించారు.

ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకు సిద్దిపేట నియోజకవర్గంలోనే 22 మంది రైతులు మృతి చెందారని, రాష్ట్రవ్యాప్తంగా 3,000 మంది రైతులు చనిపోయారని గుర్తు చేశారు. చనిపోయిన కుటుంబాలకు ఇప్పటివరకు రైతు బీమా అందలేదని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు వెంటనే 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, నిలిపివేసిన ‘రైతు బీమా’ పథకాన్ని యథావిధిగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

రైతు కుటుంబాలు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల వేదికగా రైతు బీమాపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి, బాధిత కుటుంబాలకు బీమా సొమ్ము అందేలా పోరాడతామని హరీశ్ రావు భరోసా ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>