కలం, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రష్యా యువతి (Viral Russian Girl) , బీహార్ (Bihar) యువకుడి లవ్ స్టోరీలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఆ వాళ్లిద్దరూ ప్రేమించుకోలేదని, కావాలనే కొందరు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి లవ్ స్టోరీ పేరుతో కట్టుకథ అల్లారని తేలింది. బీహార్‌కు చెందిన రాహుల్ యాదవ్ ఓ ఫారిన్ అమ్మాయితో ఊరిలో ఉన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాహుల్ ఉపాధి నిమిత్తం రష్యా వెళ్లాడని, అక్కడ అతడితో ఆ అమ్మాయి ప్రేమలో పడిందని ప్రచారం జరిగింది. రాహుల్ తర్వాత అక్కడి నుంచి సొంత ఊరికి వచ్చేశాడని, ఇక ఆ అమ్మాయి రాహుల్‌ను వదిలి ఉండలేక ఆరు నెలల తర్వాత తాను కూడా ఇండియాకు వచ్చిందని పేర్కొన్నారు. రాహుల్ పూరి గుడిసెలో ఉంటున్నా పెళ్లి చేసుకొని తనతోనే ఉంటానని చెప్తోందని, మళ్లీ రష్యాకు వెళ్లేదిలేదని అంటోందని ప్రచారం జరిగింది.
ఈ వార్త, వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఆ ఫారిన్ అమ్మాయిది రష్యా కాదని తేలింది. సదరు వైరల్ వీడియోలో కనిపించిన యువతి పేరు ఆండ్రియా కొనాలీ. ఆమె యూకే దేశస్తురాలు. అక్కడ శివియా(SHIVIA) అనే ఓ ఇంటర్నేషనల్ ఎన్జీవో తరఫున బీహార్‌లో మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం పని చేస్తోంది.
ఈ కార్యక్రమాలను బీహార్‌కు చెందిన స్థానిక భాగస్వామ్య సంస్థ సాథీ(SATHI)తో కలిసి గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఆండ్రియా, ఆమె బృందానికి అందరూ ఘన స్వాగతం పలికారు. ఈ వీడియోనే కొందరు తప్పుడు కథనాలు జోడించి ప్రచారం చేశారు. అలాగే వీడియోలో ఆండ్రియాతో ఉన్న యువకుడి పేరు రాహుల్ కాదని తేలింది. అతడి పేరు నమిత్ అని, అసలు అతడు ఎప్పుడూ విదేశాలకు వెళ్లలేదని సాథీ సంస్థ స్పష్టం చేసింది. ఈ తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని సాథీ సంస్థ వెల్లడించింది.
Also Read : గడ్డం పెంచుకుంటే ప్రజల్లో విశ్వాసం రాదు.. కేటీఆర్ కు వీరేశం కౌంటర్
Follow Us On: Youtube

