‘స్థానిక‌’ సీట్ల పంప‌కాల‌పై కూట‌మి చ‌ర్చ‌లు!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల (AP Local Body Elections) హ‌డావుడి మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో కూట‌మిలో సీట్ల స‌ర్దుబాటు అంశం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర‌లేపింది. గురువారం డిప్యూటీ సీఎం ప‌వ‌న్ స‌హా ప‌లువురు జ‌న‌సేన ముఖ్య నేత‌లు సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధ‌వ్ కూడా పాల్గొన్నారు. దాదాపు రెండు గంట‌ల పాటు వీరి స‌మావేశం కొన‌సాగింది. బుధ‌వారం మూడు పార్టీల నేత‌లు భేటీ అయినప్ప‌టికీ సీట్ల పంచాయితీ ఎటూ తేల‌లేదు. దీంతో నేడు మ‌రోసారి భేటీ అయి సుదీర్ఘంగా చ‌ర్చించారు.

జ‌న‌సేన సుమారు 6 కార్పొరేష‌న్లు, 40 మున్సిప‌ల్ స్థానాలు కోరుతున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. జ‌న‌సేన కోఆర్డినేష‌న్ క‌మిటీతో చ‌ర్చించిన త‌ర్వాతే ప‌వ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే జనసేన కోరిన స్థాయిలో సీట్లు కేటాయించలేమ‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్లు స‌మాచారం. బుధ‌వారం జ‌రిగిన స‌మావేశంలో సైతం ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. పార్టీలు బలంగా ఉన్న స్థానాల ప్ర‌కార‌మే సీట్ల కేటాయింపు ఉంటుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వెల్ల‌డించారు. జ‌న‌సేన గెలిచిన ఎమ్మెల్యే స్థానాల్లో 50 శాతం కార్పొరేష‌న్ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అనుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. తిరుపతి, ఒంగోలు కార్పొరేష‌న్లు మాకంటే మాకంటూ ఇరు పార్టీల నేత‌లు ప‌ట్టుప‌డుతున్నారు. మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పదవుల పంపకాల‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు లేదా రేపు సీట్ల పంపకాలపై తుది ప్రకటన వెలువడనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>