కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఓటర్ల నమోదు (Voter Registration) కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక అవకాశం కల్పించింది. నేడు, రేపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు (BLO) అందుబాటులో ఉండనున్నారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరులు ఉదయం నుంచే తమ సమీప పోలింగ్ కేంద్రానికి వెళ్లి కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
కొత్తగా ఓటరు కార్డు పొందేందుకు ‘ఫామ్-6’ నింపి అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత బీఎల్ఓలకు అందజేయాల్సి ఉంటుంది. అర్హులైన ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు. పారదర్శకమైన విధానంలో కొత్త ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఈ ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

