గంగనీళ్ల జాతర బందోబస్తును పరిశీలించిన డీఎస్పీ

కలం, సారంగాపూర్: సారంగాపూర్‌ మండలం అడెల్లి గ్రామంలోని శ్రీ మహా పోచమ్మ ఆలయంలో ఈ నెల 17, 18 తేదీల్లో జరగనున్న గంగనీళ్ల జాతర (Ganga Neella Jathara) బందోబస్తు ఏర్పాట్లను నిర్మల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ (DSP Srinivas) , నిర్మల్‌ రూరల్‌ సీఐ కృష్ణ బుధవారం పరిశీలించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఆలయాన్ని సందర్శించి అధికారులు పరిసర ప్రాంతాలు, పార్కింగ్‌ ప్రదేశాలను పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందులో ఎస్సై శ్రీకాంత్ ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>