అంతిమయాత్రలో ప్రమాదం.. టపాసులు పేలి నలుగురికి గాయాలు!

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకయ్యతండాలో(Venkaiah Thanda) బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ అంతిమయాత్రలో ఏర్పాటు చేసిన డీజే ట్రాలీ క్యాబిన్‌లో టపాసులు పేలడంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో భూక్య రానా, అంగోతు ధ్రువన్ తీవ్రంగా గాయపడగా, ధారావత్ రవికుమార్‌తో పాటు మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. పేలుడు ధాటికి క్యాబిన్‌లో ఉన్నవారు గాయపడటంతో స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. తొలుత టేకులపల్లి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించగా, తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న టేకులపల్లి ఎస్‌ఐ కోకిల తిరుపతి రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అంతిమయాత్రలో టపాసులు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>