యాదగిరిగుట్ట ప్రభుత్వ ఆసుపత్రిలో బతుకమ్మ సంబరాలు

కలం, యాదగిరిగుట్ట: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలను యాదగిరిగుట్ట (Yadagirigutta) ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ పావని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆసుపత్రి వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎంహెచ్‌ఓ మనోహర్, డాక్టర్ వంశీకృష్ణ హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ పండుగలను సమిష్టిగా జరుపుకోవడం ఆనందదాయకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆసుపత్రి సిబ్బంది బతుకమ్మ పాటలు, ఆటలతో సందడి చేస్తూ పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>