బుద్ధ దమ్మాన్ని అర్థం చేసుకోవడమే దమ్మ విజయం : లక్ష్మయ్య

కలం, నాగార్జునసాగర్ : బౌద్ధ ధమ్మాన్ని అర్థం చేసుకొని ఆచరించడమే దమ్మ విజయమని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. అంతర్జాతీయ పర్యాట కేంద్రమైన నాగార్జునసాగర్ బుద్ధవనం (Buddhavanam)లో బుధవారం దమ్మా విజయ వేడుకలను బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా థాయిలాండ్, కంబోడియా బౌద్ధ భిక్షువులతో కలిసి బుద్ధ చరిత వనంలోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం మహాస్తూపం ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులు వెలిగించిన తర్వాత ప్రత్యేక చాటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధవనములో వస్సా వాస కార్యక్రమంలో భాగంగా గత మూడు నెలలుగా బుద్ధ వనములో ఆవాసముంటున్న థాయిలాండ్, కంబోడియా బౌద్ధ భిక్షువులకు చీవర దాన (బౌద్ధ బిక్షకుల దుస్తులు) కార్యక్రమాన్ని నిర్వహించారు.

మహాస్థూపం సమావేశ మందిరంలో దమ్మ విజయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. బుద్ధుని బోధనలైన దమ్మమార్గం మనసులను జయించిందని, ధమ్మా విజయమే నిజమైన విజయమని అన్నారు. బుద్ధుని దమ్మాని అర్థం చేసుకోవడమే దమ్మ విజయమని దానిని సుమారు 2300 సంవత్సరాల క్రితమే అశోక చక్రవర్తి కళింగ యుద్ధం అనంతరం బౌద్ధ దమ్మ సారాంశాన్ని అర్థం చేసుకొని బౌద్ధ ధమ్మాని అక్టోబర్, 14 వ తేదీన స్వీకరించారన్నారు.

అదే బాటలో బాబాసాహెబ్ అంబేద్కర్ అక్టోబర్ 14వ తేదీన నే 5 లక్షల మంది బౌద్ధాభిమానులతో బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించారని బౌద్ధాభిమానులు ఆ రోజునే దమ్మ విజయముగా వేడుకలు జరుపుకుంటారని చెప్పారు. బుద్ధ దమ్మాని అర్థం చేసుకోవడంలోనే జీవన విధానమని ఉంటుందని, ప్రపంచ చరిత్రలో గౌతమ బుద్ధుడు, అశోక చక్రవర్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ కారణంగానే ప్రత్యేకతను సాధించుకున్నారన్నారు. ప్రతి జీవిలో స్నేహం, కరుణ, మంచిని ప్రశంసించడం, క్షమించడం ఈ నాలుగు గుణాలే బౌద్ధ దమ్మాని గొప్ప శిఖరం పైకి నిలబెట్టాయన్నారు.

అనంతరం దమ్మ పాద యాత్రకు నాయకత్వం వహించిన థాయిలాండ్ బౌద్ధ గురువు ఫ్రా సంగ్ సక్ కోవిడో మాట్లాడుతూ మూడు నెలలపాటు బుద్ధ వనములో వస్సా వాస కార్యక్రమంలో పాల్గొనడం తమకేంతో ప్రశాంతతను ఇచ్చిందని, ప్రజలు కూడా బౌద్ధ ధమ్మాన్ని అర్థం చేసుకోవడంలో ఆసక్తి కనపరిచారన్నారు. అశోకుడు బౌద్ధ దమ్మాని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేశారని అందుకే ఆయనను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారన్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సత్యనారాయణ అశోకుని దమ్మం నైతికత అనే అంశంపై ప్రసంగించారు.

తరువాత ఆంధ్రప్రదేశ్ కు చెందిన సంగారామ విహార కు చెందిన సిద్ధార్థ బంతేజి, ఇఫ్లో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సంతోష్ రావత్ లు బౌద్ధ ధమ్మా గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, బుద్ధవనం ఆర్ట్ అండ్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్ రావు, ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర, బుద్ధవనం ఓ‌ఎస్‌డి సుధాన్ రెడ్డి, బౌద్ధ అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>