రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

‎కలం, మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ జనరల్ సెక్రటరీ చిలుకూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (MLA Bathula Laxma Reddy) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన దాతలను అభినందించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, వారికి స్వయంగా ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఘనంగా కేక్ కట్ చేసి చిలుకూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పుట్టినరోజు వేడుకలను కేవలం విందు వినోదాలకే పరిమితం చేయకుండా, రక్తదానం వంటి గొప్ప సేవా కార్యక్రమంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. యువత ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున చురుకుగా పాల్గొంటూ సమాజానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>