కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లా ఎండపల్లి (Yendapalli) మండలం గుల్లకోట గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసిన అప్పులు, EMIల బాధ భరించలేక జీవితం మీద విరక్తితో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ (Simhachalam Jagan) తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తాను చితికిపోయి జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు, తన చావుకు ఎవరు బాధ్యులు కాదని, కేవలం తాను చేసిన అప్పుల బాధతో చనిపోతున్నట్లు ఆయన లేఖ రాశారు.
వృత్తి రీత్యా ఆర్ఎంపీ వైద్యుడైన జగన్ (Simhachalam Jagan) గ్రామంలో ప్రజలకు వైద్య సేవలు అందించేవాడు. గ్రామంలో తన కుటుంబానికి మంచి పేరు ఉంది. జగన్ వ్యక్తిత్వం, సేవా గుణంతో ప్రజల ఆదరణ పొందాడు. దీంతో గ్రామస్తులు ఆయనను సర్పంచ్‌గా గెలిపించారు.
ఒక్కసారి సర్పంచ్‌గా ఎన్నికైన జగన్ ఐదేళ్లపాటు ప్రజలకు సేవలు అందించాడు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరి ఉమ్మడి వెల్గటూరు మండల కార్యదర్శిగా, ఎండపల్లి మండల అధ్యక్షుడిగా దశాబ్ది కాలంగా బీఆర్ఎస్ పార్టీకి సేవలు అందించాడు.
Also Read : అధికారం కాదు… భాగస్వామ్యం ముఖ్యం: ప్రధాని మోదీ పిలుపు
Follow Us On : WhatsApp

