మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: అదనపు కలెక్టర్

కలం, నిర్మల్: మట్టి గణపతులు పూజించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు అన్నారు. నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్ లో గురువారం అధికారులకు, సిబ్బందికి ఉచిత మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, కృత్రిమ రంగుల వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన విగ్రహాలనే పూజించాలని అన్నారు. పండుగలన్ని సాంప్రదాయ పద్ధతుల్లో పర్యావరణ హితంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>