హామీలు ఎక్కడ.. అమలు ఎప్పుడు?: గుంజపడుగు హరిప్రసాద్

కలం, ​కరీంనగర్: ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని నిరసిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా పార్టీ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ (Gunjapadugu Hariprasad) మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.

ఎన్నికల హామీల్లో భాగంగా మహాలక్ష్మి రూ.2,500, తులం బంగారం, రైతులకు రూ.15,000 పెట్టుబడి సాయం, రూ.500 బోనస్, పింఛన్ల పెంపు, 2 లక్షల ఉద్యోగాలు, రూ.12,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమ హామీలు ఏమయ్యాయని హరిప్రసాద్ ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికులు, ఉద్యమకారులు, ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

​హామీల అమలు కేవలం టిఆర్ఎస్/తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితమ్మ నాయకత్వంతోనే సాధ్యమవుతుందని, డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హరిప్రసాద్ (Gunjapadugu Hariprasad) హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇంచార్జ్ లింగంపల్లి నాగరాజు, పార్టీ నాయకులు మ్యాకల తిరుపతి, అంకం శివరాణి, శ్రీరాముల రమేష్, కుతాడి శ్రీనివాస్, రంగరవేణి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : మండలిలో హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>