కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఉద్యోగాల భరర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువును ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పెంచినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి దరఖాస్తు చేసుకోవడానికి అఖరీ తేదీ సెప్టెంబర్ 9గా అంతకుముందు నిర్ణయించగా, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు TSLPRB వెల్లడించింది.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7,347 పోస్టుల భర్తీ కోసం TSLPRB జూలై 29న నోటీఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,38,336 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, అందులో 2,88,530 మంది ఫీజు చెల్లించి అప్లై ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారని TSLPRB తెలిపింది. అభ్యర్థుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియకూడా 95 శాతానికి పైగా పూర్తయిందని పేర్కొంది.

