తెలంగాణలో SIR గడువు పొడిగింపు..

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Telangana SIR-2026) ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును పెంచింది. ఈ నిర్ణయం ప్రకారం అక్టోబర్ 7 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. గతంలో ఈ గడువు సెప్టెంబర్ 16తో ముగియాల్సి ఉండగా సోమవారం మరోసారి కాలపరిమితి పెంచింది.

సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా తమ పేరు ఓటర్ల జాబితాలో లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా లేదా ఇతర అంశాలపై అభ్యంతరాలు ఉన్నా ఓటర్లు ఈ గడువులోగా సంబంధిత అధికారులకు క్లెయిమ్ లేదా అభ్యంతరం దాఖలు చేసుకునే అవకాశం ఉంది.

తాజా షెడ్యూల్ ప్రకారం క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణతో పాటు వాటి పరిష్కార ప్రక్రియ నవంబర్ 5వ తేదీ వరకు కొనసాగనుంది. అనంతరం నవంబర్ 9న తుది ఓటర్ల జాబితాను అధికారులు ప్రచురిస్తారు. గడువు పొడిగింపుతో ఓటర్లకు తమ పేర్లు, వివరాలను పరిశీలించుకుని అవసరమైన సవరణలు, అభ్యంతరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం లభించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>