తెలంగాణ COPA అధ్యక్షుడిగా సాదం అరవింద్

కలం, నిర్మల్ : తెలంగాణ రాష్ట్ర ఛాంబర్ ఆఫ్ ఫార్మసీ అసోసియేషన్ (COPA) అధ్యక్షుడిగా నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన సాదం అరవింద్ ఎన్నికైనట్లు తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ లోని TTCDA కార్యాలయంలో సాదం అరవింద్‌ ను సభ్యులు ఘనంగా సన్మానించారు.

అనంతరం అరవింద్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రాష్ట్ర COPA అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ఫార్మసిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, ఫార్మసిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TTCDA సభ్యులు, ఫార్మసీ రంగానికి చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read : రూ.40 కోట్లతో సీఎం సోదరుడికి భద్రత: హరీశ్ రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>