గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి: ఎస్సై శ్రీకాంత్

కలం, సారంగాపూర్ : గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, శాంతియుతంగా నిర్వహించుకోవాలని సారంగాపూర్ (Sarangapur) ఎస్సై శ్రీకాంత్ సూచించారు. నిర్మల్​ ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలో ఆదివారం గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉత్సవాలను స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించాలని, పోలీసు శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్సై సూచించారు. ప్రతి గణేష్ మండపం వద్ద కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దీనికి స్పందించి సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ యువత ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ సాయన్న, ఉపసర్పంచ్ పోశెట్టి, వీఓసీ సభ్యులు, గణేష్ మండపాల నిర్వాహకులు, యువత పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>