నూతన వధూవరులను ఆశీర్వదించిన చిన్నారెడ్డి

కలం, వనపర్తి: వనపర్తి మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన కురుమూర్తి, నాగమ్మ దంపతుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి (Chinna Reddy) వారి కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు. వివాహ బంధంలో అడుగుపెట్టిన నూతన వధూవరులు శ్రీకాంత్‌, మౌనికేశ్వరిలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం ప్రేమ, ఆనందం, సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో వనపర్తి మండల కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు రామేశ్వర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు బాల్‌ ఈశ్వర్‌, నందిమల్ల రాము, పెద్దమందడి మండల కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ గట్టు రాజుతో పాటు బంధుమిత్రులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>