బీఆర్ఎస్ నిర‌స‌న‌.. మ‌ల్లారెడ్డి మాస్‌ డ్యాన్స్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాల‌న‌పై బీఆర్ఎస్ నిర‌స‌న‌ (BRS Protest)లు ఊపందుకున్నాయి. అధికారంలోకి వ‌చ్చి వెయ్యి రోజులైనా హామీల అమ‌లులో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని బీఆర్ఎస్ నేత‌లు ఊరూరా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఇక మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామ‌కూర మ‌ల్లారెడ్డి (Chamakura Malla Reddy) మేడ్చ‌ల్‌లో జ‌రిగిన నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో త‌న‌దైన శైలిలో సంద‌డి చేశారు. కొద్ది నెల‌లుగా మ‌ల్లారెడ్డి బీఆర్ఎస్ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న కోడ‌లు ప్రీతి రెడ్డి వ‌రుస‌గా బీజేపీ నేత‌ల‌తో భేటీ కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ ఫ్యామిలీ బీజేపీలోకి వెళ్ల‌డం ఖాయ‌మ‌నుకుంటున్న త‌రుణంలో మ‌ళ్లీ మ‌ల్లారెడ్డి బీఆర్ఎస్ కార్య‌క్ర‌మాల్లో సంద‌డి చేస్తున్నారు.

మేడ్చ‌ల్‌లోని పీర్జాదిగూడ‌లో బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో మ‌ల్లారెడ్డి డాన్స్ చేస్తూ సందడి చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల‌ పాలన వైఫల్యాలపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే కాంగ్రెస్ వెయ్యి రోజుల పాల‌న విఫ‌ల‌మైందంటూ 420 ఫీట్ల భారీ ఫ్లెక్సీ ప్ర‌ద‌ర్శిస్తూ బాకీ కార్డుల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మ‌ల్లారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ 420 హామీలను ప్రజల ముందుంచి, ప్రతి హామీ అమలు పరిస్థితిని ప్రజలకు వివరించడమే బీఆర్ఎస్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇక మ‌ల్లారెడ్డి డ్యాన్స్ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>