నిర్మల్‌లో ‘భోగి’ సినిమా సందడి.. శర్వానంద్, అనుమప స్పెషల్ సాంగ్ షూట్!

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా దిలావర్‌పూర్ మండలం సాంగ్వి (Sanghvi) గ్రామం సినీ సందడితో కళకళలాడుతోంది. టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand), హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటిస్తున్న ‘భోగి’ సినిమా (Bhogi Movie) చిత్రీకరణ సాంగ్వి గ్రామ పరిసరాల్లో చిత్రీకరిస్తున్నారు. దీంతో గ్రామంలో సినీ వాతావరణం నెలకొంది.

శ్రీరాంసాగర్ జలాశయం బ్యాక్‌వాటర్ సమీపంలోని ప్రకృతి అందాల మధ్య సినిమా పాటను చిత్రీకరించారు. సినిమా యూనిట్ రాకతో సాంగ్వి గ్రామంలో సందడి నెలకొంది. దర్శకుడు సంపత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. నిర్మల్ జిల్లా ప్రకృతి అందాలు సినిమాలో ఏ విధంగా ఆవిష్కృతం కానున్నాయో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>