గజ్వేల్‌లో ఏబీవీపీ స్టూడెంట్ మార్చ్.. ప్రభుత్వానికి హెచ్చరికలు

కలం, మెదక్ బ్యూరో: రాష్ట్రంలో నిలిచిపోయిన 11,000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ (Gajwel ABVP)  డిమాండ్​ చేసింది. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భారీ ‘స్టూడెంట్ మార్చ్’ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సర్టిఫికెట్లు అందక, ఉన్నత చదువులకు వెళ్లలేక విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే స్పందించి బకాయిలన్నింటినీ ఒకేసారి విడుదల చేయాలన్నారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.

Also Read : కేసీఆర్ చెప్పినా కవిత వినలేదు: ప్రశాంత్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>