బీడబ్ల్యూఎఫ్ షట్లర్ల వెనుక కనిపించని హీరోలు ట్రాన్స్‌లేటర్లు!

కలం, స్పోర్ట్స్ : బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ (BWF World Championships) ముగిసినా.. తెరవెనుక పనిచేసిన అనువాదకుల కథ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చైనా, జపాన్, కొరియా షట్లర్ల మాటలను ప్రపంచానికి చేరవేయడంలో వారు కీలక పాత్ర పోషించారు. మాండరిన్, జపనీస్, కొరియన్ నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించడం అంత సులభం కాదు. ఒక్క పదం తప్పినా ఆటగాడి అసలు భావం మారే అవకాశం ఉంది. పెద్ద టోర్నీలో అది వివాదానికి కూడా దారి తీయొచ్చు.

మాండరిన్ అనువాదకుడు ఛావి రాజ్‌కు ఈ ఒత్తిడి తొలి మ్యాచ్‌లోనే ఎదురైంది. భారత ఆటగాడు ఆయుష్ శెట్టి ప్రపంచ నంబర్‌వన్ షి యూ కీని ఓడించిన మ్యాచ్‌కు ఆయన అనువాదకుడిగా పనిచేశారు. టోర్నీకి ముందు అనువాదకులు ఆటగాళ్ల పాత ఇంటర్వ్యూలను పరిశీలించారు. మీడియా అడిగే ప్రశ్నలను ఊహించారు. అవసరమైన పదజాలాన్ని ముందుగానే సిద్ధం చేసుకున్నారు. అనువాదకులు అభిమానించే ఆటగాళ్లకే అనువాదం చేయాల్సి రావడంతో ఒత్తిడి మరింత పెరిగింది.

కొన్నిసార్లు తెలిసిన పదం కూడా టెన్షన్‌లో గుర్తుకు రాకపోయేదని వారు తెలిపారు. ఛావి రాజ్ ఆటగాళ్ల ఇంటర్వ్యూలను పరిశీలించడంతో పాటు ఏఐ సాధనాలను కూడా ఉపయోగించారు. తరచుగా ఉపయోగించే పదాలను గుర్తించి నోట్స్ తయారు చేసుకున్నారు. కోర్టులో షట్లర్లు పాయింట్ల కోసం పోరాడితే.. బయట అనువాదకులు ప్రతి పదం కోసం జాగ్రత్త పడ్డారు. వారి పని కెమెరాలకు కనిపించకపోయినా.. ఆటగాళ్ల మాటలు సరైన అర్థంతో ప్రపంచానికి చేరడంలో వారి పాత్ర కీలకంగా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>