జొమాటోలో లే ఆఫ్స్.. 250 మంది ఉద్యోగులపై వేటు..!

కలం, వెబ్ డెస్క్ : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని తన కస్టమర్ సపోర్ట్ కార్యకలాపాలను నిలిపివేయాలని జొమాటో సంస్థ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో 250 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరికి ఆగస్టు నెల జీతంతో పాటు పరిహార ప్యాకేజీని అందజేసినట్లు ‘ఎకనామిక్ టైమ్స్’ తన కథనంలో వెల్లడించింది.

కస్టమర్ సపోర్ట్ మాడ్యూల్ విధానంలో చోటు చేసుకుంటున్న మార్పులు కారణంగా జొమాటో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని కస్టమర్ సపోర్ట్ కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు సంస్థ ఉద్యోగులకు సోమవారం సమాచారం అందించింది. జొమాటో అవసరాలపై సమీక్ష నిర్వహించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో ఉద్యోగాలు కోల్పోయే వారికి ఉద్యోగాలు వెతుక్కోవడంలో సాయం చేయాలని సంస్థ నిర్ణయించినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదికలో పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>