భారత్ విచ్చిన్నం కోసం సీజేపీకి అనేక దేశాల ఫండింగ్ : ఈటల

కలం, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్, శ్రీలంక లాగా భారతదేశం విచ్చిన్నం కావాలని అనేక దేశాలు కాక్రోచ్ జనతా పార్టీకి ఫండింగ్ చేస్తున్నాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని సిద్ధాంతంతో ఏర్పడ్డ పార్టీ అని ఈటల స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ శ్యామప్రసాద ముఖర్జీ ఆశించిన విధంగా ఒకే దేశం, ఒకే జెండా తీసుకువచ్చారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఏబీవీపీ, బీజేపీలు జేఏసీలో భాగస్వామ్యం అయ్యాయని గుర్తు చేశారు. కార్యకర్తలు పార్టీకి పునాదిరాళ్ళు అని పదవి రాకపోయినా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తారన్నారు. నాయకులు వస్తారు.. పోతారు కానీ కార్యకర్తలు శాశ్వతం అని స్పష్టం చేశారు. నాయకులు కార్యకర్తలను, ప్రజలను ప్రేమించాలి, లేదంటే మళ్ళీ గెలవలేరని సూచించారు. నాయకులు నోట్లో నాలుకలా ఉంటూ.. జాగ్రత్తగా మాట్లాడారని ఈటల రాజేందర్ (Eatala Rajendar) పేర్కొన్నారు.

Also Read : ఓం.. భీమ్‌.. బుష్‌.. హ‌రీశ్‌.. పొంగులేటి ఆస‌క్తిక‌ర పోస్ట్‌!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>