బాలకృష్ణ గాయంపై వైద్యుల కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘NBK111’ మూవీ షూటింగ్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బాలకృష్ణ గాయం విషయం తెలిసి ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో  ఏఐజీ ఆసుపత్రి వైద్యులు తాజాగా బాలకృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

ఆయనకు పరీక్షలు దాదాపు పూర్తి అయ్యాయని ప్రకటించిన వైద్యులు.. బాలకృష్ణ ఎడమ మోకాలి దగ్గర రక్తం గడ్డకట్టిందని వెల్లడించారు. ప్రస్తుతం బాలకృష్ణ (Balakrishna) ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. అయితే ఆయన మోకాలి కండరం ఏమైనా చిరిగిందేమో అని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్థోపెడిక్ డాక్టర్లు ఆయన్ని దగ్గరుండి చూసుకుంటున్నారని వివరించారు. అన్ని పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఆయనకు చికిత్స అందిస్తామని స్పష్టం చేశారు.

Read Also: ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. డిమాండ్లపై ప్రభుత్వం సానూకూలం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>