ఫైనల్‌కు ముందు అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగింది?

కలం, స్పోర్ట్స్: న్యూయార్క్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026) ఫైనల్ మ్యాచ్‌తో అర్జెంటీనా ప్రయాణం ముగిసింది. అంతకుముందు సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై అద్భుత పునరాగమనంతో గెలిచి ఫైనల్‌కు చేరిన ఆ జట్టు, తుదిపోరులో అనూహ్యంగా పేలవ ప్రదర్శన ఇచ్చింది. స్పెయిన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఒక్కసారి కూడా ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా షాట్ కొట్టలేకపోయింది. కెప్టెన్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

ఈ విఫల ప్రదర్శన తర్వాత, మ్యాచ్ ప్రారంభానికి ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో చిత్రీకరించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియో జట్టులో ఏదో అవాంఛనీయ సంఘటన జరిగిందనే అనుమానాలకు తావిస్తోంది. వీడియోలో మెస్సీ తన సహచర ఆటగాళ్లను శాంతపరచడానికి ప్రయత్నిస్తూ కనిపించారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని, జరిగిన విషయాన్ని మరిచిపోయి కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలని ఆయన సహచరులను కోరారు.

స్టేడియానికి నవ్వుతూ వచ్చిన ఆటగాళ్లు, మైదానంలోకి దిగేసరికి తీవ్ర నిరాశతో కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఎంజో, లిచా, పరేడెస్ వంటి కీలక ఆటగాళ్ల ముఖాల్లో స్పష్టమైన విచారం కనిపించింది. మెస్సీ మాటలు, ఆటగాళ్ల ప్రవర్తన చూసిన అభిమానులు, మైదానంలోకి అడుగుపెట్టే ముందే జట్టులో ఏదో జరిగిందని భావిస్తున్నారు.

ఈ పరాజయం తర్వాత, మెస్సీ లేకుండానే అర్జెంటీనా జట్టు స్వదేశానికి చేరుకుంది. 2022లో టైటిల్ గెలిచినప్పటిలా విజయోత్సవం లేకపోయినా, వేలాది మంది అభిమానులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి ఆటగాళ్లకు ఘనస్వాగతం పలికారు. కోచ్ లియోనెల్ స్కలోని నేతృత్వంలో వచ్చిన జట్టుకు విమానాశ్రయం బయట రెడ్ కార్పెట్, మిలటరీ బ్యాండ్‌తో స్వాగతం లభించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>