మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి: ఏఐటీయూసీ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానం తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర అధ్యక్షులు టంగుటూరి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రాజాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మహబూబ్ నగర్ జిల్లా మూడవ మహాసభలు రాములు అధ్యక్షతన జరిగాయి. మహాసభల ప్రారంభ సూచికగా ముందుగా ఏఐటీయూసీ జెండాను సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు ఎగరవేశారు.

ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన టంగుటూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ వ్యవస్థలో పారిశుద్ధ్య కార్మికులే కీలకమని అన్నారు. గ్రామంలోని అపరిశుభ్రత మురికి మలినాలను, చెత్త చెదారాలు తొలగిస్తూ గ్రామాన్ని అద్దంలో తీర్చిదిద్దుతున్న గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది జీవితాలు మాత్రం చాలీచాలని వేతనాలతో దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 51 గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికుల జీవితాలకు మరణ శాసనాలుగా మారిందని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 51ని సవరించాలని కోరారు. కనీస వేతనం 26వేలకు పెంచాలని, గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన అదనపు కార్మిక సంఖ్యను పెంచి పనిభారం తగ్గించాలని, పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం అందించాలని కోరారు. కార్మికులపై రాజకీయల జోక్యం, నాయకుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధనకై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

జిల్లా నూతన సమితి ఎన్నిక

తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) మహబూబ్ నగర్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులుగా బి. నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి.రాములు, జిల్లా ఉపాధ్యక్షులుగా పి.ఆంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శిగా అంజమ్మ, కోశాధికారిగా వి. శ్రీహరి, లతో పాటు ఐదుగురు కార్యవర్గ సభ్యులుగా, ఏడు మంది కౌన్సిల్ సభ్యులుగా, ముగ్గురు కో ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సురేష్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోవర్థన్, తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు, నాయకులు కార్మికులు యాదయ్య, శ్రీను, సత్తయ్య, జావీద్, సోములు, రఘు, నారాయణ, చంద్రమ్మ, చంద్రమ్మ, జంగమ్మ, మంజుల,పెంటమ్మ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>