బాలయ్యకు ప్రమాదం.. స్పందించిన ఎన్టీఆర్

కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తన కొత్త ప్రాజెక్టు ఎన్‌బీకే (NBK111) చిత్ర షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. ఏపీలోని కాకినాడ పరిసర ప్రాంతాల్లో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చిత్రీకరణ సమయంలో బాలయ్యకు గాయం అయినట్లు తెలుస్తోంది. బాలకృష్ణకు గాయాలు అవడంతో కుటుంబ సభ్యులు, సినీ అభిమానులు, సినీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. బాబాయి ఆరోగ్యంపై జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఎక్స్ వేదికగా స్పందించారు.

బాబాయి నందమూరి బాలకృష్ణ (Balakrishna) త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఆకాంక్షించారు. ‘గెట్ వెల్ సూన్ బాల బాబాయ్. మీరు త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. తిరిగి ఫుల్ ఫామ్‌లోకి రావాలి. దానికోసం ఎదురు చూస్తున్నా’ అని ట్వీట్ చేశారు. అటు బాల మావయ్య త్వరగా కోలుకోవాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. ఈ మేరకు బాలయ్యను ఆయన ఫోన్‌లో పరామర్శించినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. గాయం నుంచి త్వరగా కోలుకొని యథావిధిగా షూటింగ్‌లో పాల్గొనాలని పేర్కొన్నారు. హీరో నందమూరి కల్యాణ్‌ రామ్‌ సైతం బాబాయి ఆరోగ్య పరిస్థితిపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. త్వరగా కోలుకొని మళ్ళి యధావిధిగా షూటింగ్ లలో పాల్గొనాలని ఆకాంక్షించారు.

Read Also: ‘టాక్సిక్’ నుంచి మరో సాంగ్ రిలీజ్.. తబాహీ మించి రొమాన్స్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>