సోనమ్ వాంగ్‌చుక్‌‌ ట్రీట్‌మెంట్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

కలం, వెబ్ డెస్క్: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భారతదేశంలో ప్రజాస్వామ్య పౌరుడికి కావలసిన వైద్యుడిని, ఆసుపత్రిని ఎంచుకునే హక్కు ఉందని తెలిపింది. కోర్టు నుంచి ఉత్తర్వులు రాగానే, ఆయనను సఫ్దర్‌జంగ్ నుంచి మేదాంత ఆస్పత్రికి తరలిస్తారు. ఈ సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్‌‌ భార్య డాక్టర్ గీతాంజలి ఆంగోమో హర్షం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ వద్దే ఆయన ఆరోగ్య పర్యవేక్షించే వెసులుబాటు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆంక్షలు విధించిందని ఆరోపించారు.

సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో ఉన్న సోనమ్‌ను కలవడానికి వచ్చిన అనేకమంది ఎంపీలను కూడా అధికారులు అనుమతించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులను సైతం సోనమ్‌ (Sonam Wangchuk)తో  మాట్లాడనివ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

Read Also: నీళ్లు లేవు.. సౌకర్యాలు లేవు! : JNTUH విద్యార్థుల ఆందోళన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>