‘టాక్సిక్’ నుంచి మరో సాంగ్ రిలీజ్.. తబాహీ మించి రొమాన్స్!

కలం, వెబ్ డెస్క్: యష్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం టాక్సిక్. ఈ మూవీ నుంచి రెండో సింగిల్ (Toxic Second Single) ‘మనసాగదే’ విడుదలైంది. ఈ పాటలో యష్, తారా సుతారియా మధ్య సాగే సరదా బంధాన్ని చూపించారు. గతంలో విడుదలైన ‘తబాహి’ పాటలో కియారా అద్వానీతో యష్‌కి ఉన్న బంధాన్ని భిన్నంగా ఈ పాట ఉంటుంది. మూడు నిమిషాలకుపైగా ఉన్న ఈ పాటలో వారిద్దరి మధ్య నవ్వులు, చిలిపి ప్రపోజల్స్, ఆత్మీయ సంభాషణలు, ఒకరినొకరు అర్థం చేసుకునే సహజమైన బాండింగ్‌ ఆకట్టుకుంది.

ఈ పాట ద్వారా యశ్‌లోని మరొక కోణాన్ని మేకర్స్ పరిచయం చేశారు. ఇప్పటివరకు పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన యష్ ఇందులో కూల్‌గా కనిపిస్తారు. దీనితోపాటు సినిమాలోని ఇతర కీలక పాత్రల పరిచయాన్ని కూడా ఇందులో చూపించారు. నయనతారతో యష్‌(Yash)కు ఉన్న నమ్మకమైన బంధం, కియారా అద్వానీతో యష్‌కు భావోద్వేగపూరిత సంబంధాన్ని చూడొచ్చు. ఈ సినిమా (Toxic)పై భారీ అంచనాలు ఉన్న తరుణంలో, ఈ రెండవ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Read Also: బాలయ్యకు ప్రమాదం.. స్పందించిన ఎన్టీఆర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>