హ్యాకర్లకు చెక్ పెట్టాలంటే.. వాట్సాప్ లో ఈ ఫీచర్లు ఆన్ చేయండి!

కలం, వెబ్ డెస్క్: నేటి డిజిటల్ యుగంలో వాట్సాప్ అనేది కేవలం మెసేజింగ్ యాప్ మాత్రమే కాదు. మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. మన వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారానికి కేంద్రంగా మారిన వాట్సాప్ అకౌంట్లు హ్యాకింగ్ కు గురికావడం ప్రస్తుతం ఒక తీవ్రమైన సవాలుగా మారింది. అయితే వాట్సాప్ భద్రత (WhatsApp Security) పై సరైన చర్యలు తీసుకోకపోతే మనం సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు టెక్ నిపుణులు. అయితే మన వాట్సాప్ అకౌంట్ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాట్సాప్ భద్రతకు బ్రహ్మాస్త్రం.. పాస్–కీ

వాట్సాప్ ను సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా రక్షించుకోవడానికి పాస్–కీ రక్షణ కవచంలా పనిచేస్తుందని చెబుతున్నారు. పాస్–కీలుగా వాడే యూజర్ ఫేస్ ఐడీ, టచ్ ఐడీ లేదా ఫింగర్ ప్రింట్ లు నేరుగా వినియోగదారుడి డివైజ్ లకు అనుసంధానమై ఉంటాయి. ఒకవేళ వినియోగదారులు పొరపాటున తమ సమాచారాన్ని హ్యాకర్లకు చేరవేసినా, ఈ–పాస్ కీ లేకుండా అకౌంట్‌ను ఓపెన్ చేయడం సాధ్యం కాదట. పాస్–కీల విషయంలో కొద్దిపాటి రిస్క్ కూడా ఉండదని చెబుతున్నారు టెక్ నిపుణులు.

ఈమెయిల్ వెరిఫీకేషన్

వాట్సాప్ అకౌంట్ కోల్పోకుండా ఉండేందుకు ఈమెయిల్ వెరిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా సిమ్ కార్డు పోయినప్పుడు, లేదా ఫోన్ నంబర్ మారినప్పుడు, సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో MMS కోడ్స్ అందుబాటులో లేనపుడు వాట్సాప్ కోల్పోకుండా ఉండేందుకు ఈ మెయిల్ వెరిఫికేషన్ ఉపయోగపడుతుంది.

టూ–స్టెప్ వెరిఫికేషన్

వాట్సాప్ అకౌంట్ భద్రతను వంద శాతం పెంచేందుకు టూ–స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్ ను ఆన్ చేసుకోవాలని చెబుతున్నారు టెక్ నిపుణులు. ఈ ఫీచర్ ఖాతాకు అదనపు రక్షణ కవచంలా పనిచేస్తుందని చెబుతున్నారు. సాధారణంగా వచ్చే SMS కోడ్ తో పాటు, మీరు సొంతంగా క్రియేట్ చేసుకునే పిన్ నెంబర్ కూడా ఎంటర్ చేసినప్పుడే అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ సైబర్ నేరగాళ్లు మీ మొబైల్ కు వచ్చిన SMS కోడ్ ను దొంగిలించినా, పిన్ నెంబర్ ఎంటర్ చేయకపోతే వారు అకౌంట్ ను యాక్సెస్ చేయలేరు.

ఫేస్ ఐడీ, ఫింగర్ ప్రింట్‌తో అకౌంట్ లాక్

లాగిన్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నంత మాత్రాన పని పూర్తయినట్టు కాదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇతరులకు మన డివైజ్ చిక్కినప్పుడు లేదా మన ప్రమేయం లేకుండా ఇతరులు వాట్సాప్ ఓపెన్ చేసేందుకు వీలు లేకుండా ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీతో అకౌంట్‌ను లాక్ చేసుకోవడం అత్యంత అవసరమని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ ఇతరుల చేతికి మీ ఫోన్ చిక్కినపుడు లేదా మీ మొబైల్ అన్ లాక్ అయి ఉన్నప్పుడు వాట్సాప్ చాటింగ్ చూడకుండా ఉండేందుకు ఈ పీఛర్ ఉపయోగపడుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>