ఆటో ఎక్కిన కిరణ్ అబ్బవరం.. ఏం జరిగిందంటే!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో జోరున వర్షం పడుతోంది. హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కంగారు పడుతున్నాడు. తన కొత్త మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ లాంచ్ ముహూర్తానికి ఆలస్యమవుతోంది. కారులో వెళ్లే పరిస్థితి లేదు. మరి ఏం చేద్దాం.. అని ఆలోచిస్తూ ఆటోను పిలిచారు. హీరోయిన్ గౌరి ప్రియ, నిర్మాత ఎస్ కే ఎన్ తో కలిసి కిరణ్ ఆటో ఎక్కేశారు. మొత్తానికి అనుకున్న సమయానికే చేరుకుని గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేశారు. వారు ఆటోలో వెళ్తున్న వీడియో నెట్టింట వైరలవుతోంది.

ఆకట్టుకుంటున్న ట్రైలర్..

కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ ట్రైలర్ ఆసక్తిని కలిగిస్తోంది. ఆయనకు జోడీగా గౌరి ప్రియ నటిస్తోంది. చెన్నైలో ఉండే హీరోయిన్ అప్పటికే లవ్ ఫెయిల్యూర్ అయి ఆల్కహాల్ తాగుతూ డిప్రెషన్‌లో ఉంటుంది. అదే సమయంలో, సినిమా డైరెక్టర్ కావాలనే కలతో హీరో చెన్నై చేరుకుంటాడు.

వీరిద్దరి మధ్య పరిచయం మొదలవుతుంది. హీరోయిన్‌ను మార్చేందుకు హీరో తెగ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడుతారు.. మరి, హీరోయిన్ మారిపోతుందా..? హీరో డైరెక్టర్ కల నెరవేరుతుందా..? అనేది వెండి తెరపై చూడాల్సిందే. రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా.. సాయి రాజేశ్ కథ అందించాడు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>